టాలీవుడ్ యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోన్గా నటించాడు. ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో వరుణ్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను సూపర్ గా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా వరుణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా వరుణ్ "ఫిదా" మూవీ తర్వాత సాయి పల్లవి తో సినిమా చేయకపోవడానికి గల కారణాలని వివరించాడు.

తాజా ఇంటర్వ్యూ లో వరుణ్ మాట్లాడుతూ ... ఫిదా సినిమా పూర్తి అయిన తర్వాత నేను హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా సినిమా చేయమని చాలా మంది అడిగారు. కాకపోతే ఫిదా సినిమా కంటే గొప్ప కథ దొరికినప్పుడే మళ్ళీ మేమిద్దరము కలిసి నటించాలి అని డిసైడ్ అయ్యాము. అందుకే ఇప్పటి వరకు సాయి పల్లవి తో సినిమా చేయలేదు. ఒక వేళ ఫిదా సినిమా కంటే గొప్ప కథ కనుక ఎవరైనా తీసుకువచ్చినట్లు అయితే అందులో సాయి పల్లవి ని హీరోయిన్ గా వారు అనుకుంటే అప్పుడే మా ఇద్దరి కాంబో లో సినిమా ఉంటుంది అని వరుణ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే వరుణ్ హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఫిదా సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లో వరుణ్ , సాయి పల్లవి నటనలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ సినిమాలో వీరిద్దరి జోడీకి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt