కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగించిన ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత కాలంలో ఈయన కు పెద్ద విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇక కొన్ని సంవత్సరాల క్రితమే ఈయన చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈయన చనిపోయిన కూడా ఈయన సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈయన కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఓ రెండు సినిమాలను మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ కెరియర్ ప్రారంభంలో తేజ దర్శకత్వంలో నువ్వు నేను అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇలా ఆ టైమ్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ మూవీ ని త్వరలోనే రీ రిలీజ్ చేయాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మూవీ తో పాటు నితిన్ కెరియర్ ప్రారంభంలో విడుదల అయినటువంటి మనసంతా నువ్వే మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ని కూడా త్వరలోనే రీ రిలీజ్ చేయాలి అని ఈ మూవీ బృందం వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ రెండు సినిమాలను ఈ సంవత్సరం మార్చి , ఏప్రిల్ నెలలో రీ రిలీజ్ చేయాలి అని ఈ మూవీ బృందాలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

uk