సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో స్త్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా ... రమ్య కృష్ణ , జయరామ్ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

ఇకపోతే గుంటూరు కారం సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్న మహేష్ మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇకపోతే భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా యొక్క ఓపెనింగ్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించాలి అని రాజమౌళి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ యొక్క ప్రారంభ రోజుకు హాలీవుడ్ డైరెక్టర్ జామ్స్ కెమెరాన్ ను తీసుకురావాలి అని రాజమౌళి డిసైడ్ అయినట్లు అందులో భాగంగా ఈయన తో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపినట్లు ఈయన అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈయన గనుక ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చినట్లు అయితే ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆ ఉంటే గతంలో రాజమౌళి , జామ్స్ కామరన్ మధ్య భారీ సంభాషణ జరిగిన విషయం కూడా మనకు తెలిసింది. దానితో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: