మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ నటి అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి "పుష్ప పార్ట్ 1" సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటికి ఈ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దానితో ప్రస్తుతం రష్మిక వరుస హిందీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ నటి రన్బీర్ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. 

ఇక ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ చేతుల అనేక తెలుగు , తమిళ , హిందీ సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస సినిమా అవకాశాలతో అద్భుతమైన జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న ఈ నటి సినిమాలలో అవకాశం దొరికినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ భారీగానే అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇకపోతే ఈ మ ధ్యకాలంలో ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన చాలా హాట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అంతే కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm