టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ తాజాగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మార్చి 1 వ తేదీన తెలుగు , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో వరుసగా వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో వరుణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో వరుణ్ తేజ్ కు మీరు ఇండస్ట్రీ లో ఉన్న నటులలో నితిన్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంది అని వార్తలు ఉన్నాయి అది నిజమేనా అనే ప్రశ్న ఎదురైంది. దానికి వరుణ్ తేజ్ స్పందిస్తూ ... అవును నిజమే. మేమిద్దరం మంచి స్నేహితులం. చాలా విశాయలపై మాట్లాడుకుంటూ ఉంటాం. సినిమా విషయాలు బాగా మాట్లాడుతాం. సినిమా ఒక వేళ ఫ్లాప్ అయినట్లు అయితే ఎందుకు ఫ్లాప్ అయ్యింది.

నెక్స్ట్ ఏ తప్పులు చేయకూడదు అనే విషయంపై కూడా మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే మా స్నేహం ఎలా పుట్టిందో తెలియదు. కాకపోతే ప్రస్తుతం మాత్రం మేము మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత మీరు మీ ఫ్యామిలీలో ఉన్న హీరోలతో కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఏ హీరోతో అయినా సినిమా చేయాలి అని అనుకుంటున్నారా అనే ప్రశ్న వరుణ్ కి ఎదురు కాగా ... దానికి నేను నితిన్ తో సినిమా చేయాలి అని చాలా రోజులుగా అనుకుంటున్నా. కానీ అన్నిటి కంటే కథ ముఖ్యం. మంచి కథ దొరికితే నితిన్ తో సినిమా చేస్తాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt