టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈయన సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఈయన కొంత కాలం క్రితం పలక్ నామ దాస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈయన ఈ సినిమాలో హీరో.గా కూడా నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయన నటుడు గా మాత్రమే కాకుండా దర్శకుడి గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇకపోతే కొంత కాలం క్రితం విశ్వక్ "దాస్ కా దమ్కి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి కూడా ఈయనే దర్శకత్వం వహించాడు. ఇలా నటుడిగా , దర్శకుడి గా మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న విశ్వక్ తాజాగా గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా బృందం వారు ఈ మూవీ కి సంబంధించిన బిజినెస్ లను క్లోజ్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి "జీ 5" భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా "జీ 5" ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: