'జనతా గ్యారేజ్' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి కొరటాల శివతో 'దేవర' సినిమాని మొదలుపెట్టారు. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాక ప్రేక్షకుల్లో కూడా ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం సిటీకి దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం 'దేవర' సినిమా షూటింగ్లో ఆయన తిరిగి పాల్గొన్నారని సమాచారం తెలుస్తోంది.ప్రస్తుతం 'దేవర' సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారట. ఇంకా అలాగే కొన్ని రోజులు రాత్రి పూట కూడా షూటింగ్ జరగనుంది. ఎన్టీఆర్  సెట్స్ లో జాయిన్ అయినట్లు సమాచారం తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.


ఇక ఈ సినిమా ఆమెకు తెలుగు సినిమా పరిశ్రమలో తొలి సినిమా కావడం విశేషం.అక్టోబర్ 10, 2024న రిలీజ్ కానుంది 'దేవర'.నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వారు అధికారికంగా తెలిపారు. అయితే షూటింగ్లో జరిగిన ఆలస్యం, వీఎఫ్ఎక్స్ వర్క్లో పర్ఫెక్షన్ కోసం ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ఈమధ్య ప్రకటించారు.ఇక ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అనుకున్న సమయానికి అనిరుధ్ రవి చందర్ ట్యూన్స్ ఇవ్వలేకపోవడం కూడా సినిమా విడుదలలో ఆలస్యానికి కారణం అయిందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లు అన్నీ ఆగాలంటే తొందరలోనే 'దేవర' ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్టు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో కూడా రికార్డులు బద్ధలు కొట్టాలని చూస్తున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: