గత ఏడాది ఎడాపెడా సినిమాలు తీసి చాలా కష్టపడి పోయింది పెళ్లి సందడి ముద్దుగుమ్మ శ్రీలీల. ఆమెకు కాస్త రెస్ట్ ఇద్దామని టాలీవుడ్ దర్శకులంతా కొత్త హీరోయిన్స్ ని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు.అలా శ్రీలీల కు చెక్ పెడుతూ ఈ మధ్యకాలంలో కొత్త హీరోయిన్స్ ఒక ముగ్గురు నలుగురు ఇండస్ట్రీకి వచ్చేసారు. దాంతో శ్రీలీలకు ఈ కొత్త హీరోయిన్స్ చెక్ పెడతారనే అంతా అనుకుంటున్నారు. పైగా ఆమె గత ఏడాది ఒప్పుకున్న సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకోగా ఆమె చేతిలో మరో కొత్త చిత్రం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల నటిస్తున్న కూడా అది షూటింగ్ ఆలస్యం అవుతోంది.ఈ సినిమా తప్ప ఆమె తెలుగులో మరొక సినిమాలు నటించడం లేదు. మరి శ్రీలీల కు పోటీగా వస్తున్న ఆ కొత్త హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం. అమిగో సినిమాతో కళ్యాణ్ రామ్ సరసన నటించి తొలిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆషిక రంగనాథ్ . ఆ చిత్రం తర్వాత నా సామిరంగా సినిమాలో నాగార్జున సరసన నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో ఆమెకు ప్రస్తుతం ఆఫర్ల వెల్లువా పెరిగింది.

తెలుగులో అనేక సినిమాలకు సైన్ చేస్తోంది. చిరంజీవి విశ్వంభర చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక బేబీ మూవీ తో సూపర్ సెన్సేషనల్ ఆయన వైష్ణవి చైతన్  కూడా తెలుగులో బాగానే బిజీ అయింది.  బేబీ సినిమా తర్వాత ఆనంద దేవరకొండ తో మరో సినిమాలో నటిస్తుంది. అలాగే ఆశిష్ రెడ్డి, సిద్దు జొన్నలగడ్డ చిత్రాలు కూడా ఆమె సైన్ చేసినట్టుగా తెలుస్తున్నాయి.సప్త సాగరాలు దాటి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది రుక్మిణి వసంత్. ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రవితేజ, అనుదీప్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేరుగా రుక్మిణి నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా తమిళంలో కూడా శివ కార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తుండగా ఇప్పటికే తమిళంలో తాను చేసిన మరొక చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.మిస్టర్ బచ్చన్ సినిమాతో రవితేజ సరసన మరో కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నారు ఆ చిత్ర టీమ్. ఆమె పేరు భాగ్యశ్రీ బోర్సే. మరి ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త అందాలు బాగానే కనువిందు చేయబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: