తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి లత దంపతులు 43వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.రజనీకాంత్ మామోలోడు కాదు, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయినే పడేశాడు.ఫిబ్రవరి 27న కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహించారు. అమ్మానాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ వారి చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో తమ పెళ్లి రోజు సందర్భంగా రజనీకాంత్, లత ఉంగరాలు, చైన్ మార్చుకుంటూ కనిపించారు.తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేస్తూ, సౌందర్య ఆసక్తికర విషయాలను పంచుకుంది. “43 సంవత్సరాల వివాహ బంధంలో ప్రియమైన అమ్మ, నాన్న ఎప్పుడూ ఒకరికొకరు అండగా నిలబ్డారు. 43 సంవత్సరాల క్రితం వారు మార్చుకున్న చైన్, రింగులు ప్రతి ఏటా వారిని కలుపుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా నాటి చైన్, ఉంగరాలను మరోసారి మార్చుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ x వేదికగా రాసుకొచ్చింది.ఫిబ్రవరి 26న 1981లో రజనీకాంత్, లతను పెద్దల సమక్షంలో సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. వాస్తవానికి వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. వీరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1980లో రజనీకాంత్ 'తిల్లు ముల్లు' షూటింగ్లో ఉన్నప్పుడు, ఒక విద్యార్థిని కాలేజీ మ్యాగజైన్ కోసం ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. ఆ అమ్మాయి మరెవరో కాదు లతా రంగాచారి.

ఇంటర్వ్యూ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఆమె వినయం, మాట్లాడే విధానం రజనీకాంత్ కు చాలా నచ్చింది. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇంటర్వ్యూ కంప్లీట్ కాగానే, తన మనసులోని మాటను లతతో చెప్పేశారు. లత ఎలాంటి సమాధానం చెప్పకుండా, నవ్వుతూ, తన తల్లిదండ్రులతో మాట్లాడాలని చెప్పారు. అదే సమయంలో రజనీకాంత్ సన్నిహితుడు వై జి మహేంద్రన్ కు లతకు బంధువు అని తెలిసింది. ఈ విషయాన్ని లత తల్లిదండ్రులకు చేప్పారు. సినిమా పరిశ్రమలోని పలువురు పెద్దలు ఈ పెళ్లి కోసం లత పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించారు. దీంతో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రజనీ, లతల పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు ఐశ్వర్య, మరొకరు సౌందర్య.అటు రజనీ సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అంతగా సక్సెస్ కాలేకపోయింది. తాజాగా మరో సినిమాలో రజనీ నటించేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్ సీనియర్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలాతో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. “దిగ్గజ నటుడు రజనీకాంత్తో కలిసి పని చేయడం నాకొక గౌరవం. మర్చిపోలేని మా ప్రయాణం మొదలు కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం’ అంటూ సాజిద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: