బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, ఇలియానా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తేరా క్యా హోగా లవ్లీ'. సోషల్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. బల్వీందర్ సింగ్ జంజువా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవ్విస్తూనే, పలు సామాజిక అంశాలను టచ్ చేస్తూ ఆలోచింపజేస్తోంది.‘తేరా క్యా హోగా లవ్లీ‘ సినిమా అందం, వరకట్నం లాంటి విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందంగా లేని అమ్మాయిలు సమాజంలో ఎలా చిన్న చూపుకు గురవుతున్నారు? అనే విషయాన్ని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు బల్వీందర్. ఇలియానా ఈ సినిమాలో అందంగా లేని అమ్మాయిగా కనిపించింది. ఆమె రంగు కారణంగా ఎన్నో పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అవుతాయి. డబుల్ కట్నం ఇస్తే అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని ఓ కుటుంబం ముందుకు వస్తుంది. అదే సమయంలో ఇలియానా ఇంట్లో దొంగతనం జరుగుతుంది. కట్నంగా ఇవ్వాల్సిన ఖరీదైన వస్తువులన్నీ దొంగలు దోచుకెళ్తారు. అమ్మాయి తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ కేసును హర్యానా పోలీసు అధికారి రణదీప్ దర్యాప్తు చేస్తాడు. దొంగలను పట్టుకునేందుకు ఆయన ప్రయత్నిస్తాడు.

విచారణలో భాగంగా ఇలియానాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తాడు. ఈ సమయంలో ఆమెను ఇష్టపడుతాడు. అప్పుడు ఈ సోషల్ కామెడీ మూవీలో రొమాంటిక్ ట్విస్ట్ మొదలవుతుంది. మొత్తంగా సామాజిక అంశాలకు కామెడీని జతచేసి దర్శకుడు కథ నడిపిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. పనిలో పనిగా ట్రైలర్లో ఓ డిస్క్లెయిమర్ ను యాడ్ చేశారు మేకర్స్. "భారత రాజ్యాంగం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది కేవలం కల్పిత చిత్రం. చర్మం రంగు, వరకట్నం అనేది ఒక సామాజిక దురాచారం. ఈ సినిమాతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా వరకట్న ఆచారాన్ని ఆమోదించరు” అని ప్రకటించారు.‘తేరా క్యా హోగా లవ్లీ’ మూవీ నవంబర్ 2022లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదర్శించారు. అప్పటి నుంచి ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే నెల మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది. రణదీప్ హుడా, ఇలియానా డి'క్రూజ్ నటించిన ఈ చిత్రంలో కరణ్ కుంద్రా, గీతా అగర్వాల్ శర్మ, గీతిక విద్యా ఓహ్లియన్, పవన్ మల్హోత్రా ఇతర పాత్రలు పోషించారు. అనిల్ రోధన్, కునాల్ మండేకర్ ఈ సినిమాకు కథను అందించారు. ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, మూవీ టన్నెల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: