ఇటీవల బాలీవుడ్ స్టార్ మ్యూటీ అలియా భట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన పోచార వెబ్ సిరీస్ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట.. వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తూ కోటి రూపాయల దోపిడీ.ఆధారంగా ఈ స్టోరీ తెరకెక్కింది. నిమిషా సజయన్‌, రోషన్ మాధ్యు, దిబ్యేందు భట్టా చార్య తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు నటించారు. ఇక ఈ సినిమాను ఢిల్లీ క్రైమ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ డైరెక్టర్ రిచీ మెహతా రూపొందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ను వీక్షించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ సిరీస్ రివ్యూ తెలియజేశాడు.మహేష్ వివరిస్తూ ఏనుగులను అంత క్రూరంగా ఎలా చంపేస్తున్నారు.. అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకడం లేదా.. మానవత్వం లేకుండా అలా ఎలా చేయగలరు.. ఈ సిరీస్ ను చూస్తున్నంత సేపు నాకు ఇవే ప్రశ్నలు మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. ఈ జెంటిల్ జాయింట్స్ ను కాపాడుకోవడానికి మనందరం కలిసి పోరాడాలి అంటూ మహేష్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం పోచార్‌ వెబ్ సిరీస్ ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది. దీంతో పాటు మహేష్ బాబు రివ్యూ తో ఈ సిరీస్ కు మరిన్ని రికార్డులకు క్రియేట్ అవుతాయని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకీ పోచర్‌ వెబ్ సిరీస్ మనం ఎక్కడ చూడవచ్చు. ఎన్ని భాషల్లో రిలీజ్ అయింది ఒకసారి చూద్దాం.

ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పోచర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ అవుతూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. భారతదేశంలోని అతిపెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇది కూడా ఒకటి అనే క్యాప్షన్ తో రూపొందిన పోచార్.. ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఏనుగులను వేటాడే ముఠా అల్లర్లు, వారిని పట్టుకోవడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ చేసే విశ్వ ప్రయత్నాలు.. ఇలా ఎప్పటికప్పుడు ముందు ముందు ఏం జరుగుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొల్పారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై రికార్డులు క్రియేట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: