ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద ప్రస్తుతం చిక్కులలో పడింది.. తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. ఈమెను అరెస్టు చేయవలసిందిగా పోలీసులకు సైతం కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారణ నియమాలను ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్ రాంపూర్లో జయప్రదపైన ఒక కేసు నమోదు అయింది. అందుకు సంబంధించి హైకోర్టుల ప్రస్తుతం ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటికే కోర్టు నుంచి ఎన్నోసార్లు సామాన్లు జారీ అయినప్పటికీ ఈమె విచారణకు హాజరు కాలేదట..


దీంతో కోర్టు వెంటనే ఈమెను అరెస్టు చేయాలంటూ ఉత్తర్వులను జారీ చేసింది.. అయితే ఈ విషయం పైన కూడా ఆమె స్పందించలేదు.. దీంతో జయప్రదయపైన కోర్టు వారెంట్ జారీ చేస్తూ మార్చి 6న కోర్టు ముందు హాజరు కావాలని రాంపూర్ పోలీసులకు సైతం ఉత్తర్వులను ఆదేశించారు.. నిన్నటి రోజున విచారణలో జయప్రద పరారీలో ఉన్నట్లు కోర్టు డైరెక్టర్గా ప్రకటించింది. ఇందుకు ఒక టీమ్ ని కూడా ఏర్పాటు చేసి మార్చి 6వ తేదీన జయప్రదను విచారణకు హాజరయ్యేలా చేయాలంటూ కోర్టు ఉత్తర్వులను ఇచ్చింది.


ప్రస్తుతం హీరోయిన్ జయప్రద ను ఒక టీమ్ గాలిస్తున్నట్లు సమాచారం.జయప్రదపైన ఎన్నోసార్లు నాన్ బెయిల్ వారంటీ  కూడా జారీ అయ్యాయి. అయితే జయ ప్రధను మాత్రం పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరు పరచలేకపోయారు.. సీనియర్ అధికారులు తెలుపుతున్న ప్రకారం జయప్రద మొబైల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని.. దీంతో ఆమెను సంప్రదించలేకపోయామని వెల్లడించారు.. ప్రస్తుతం ఈమె వయసు 61 ఏళ్లు తెలుగులోనే కాకుండా కన్నడ హిందీ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించి భారీ క్రేజీ సంపాదించుకుంది.. 1994లో టిడిపిలో చేరింది 2004లో ఈ పార్టీని వీడి సమాజ్ వాది పార్టీలో చేరారు. 2010లో మళ్ళీ ఆ పార్టీని వదిలేసి 2014లో లోక్ దళ్ పార్టీలో చేరారు మళ్లీ 2019లో బిజెపిలో చేరింది జయప్రద.

మరింత సమాచారం తెలుసుకోండి: