ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో శ్రీ విష్ణు ఒకరు . ఈయన తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు . ఇక పోతే మెంటల్ మదిలో అనే సినిమాతో ఈయన హీరో గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బ్రోచేవారెవరురా , నీది నాది ఒకే కథ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇకపోతే ఈ నటుడు ఆఖరుగా "సామజవరగమన" అనే సినిమా లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను ఎదుర్కొన్న శ్రీ విష్ణు ఈ మూవీ తో హిట్ ట్రాక్ లోకి వచ్చేసాడు . ఇక పోతే ప్రస్తుతం శ్రీ విష్ణు "ఓం భీమ్ బుష్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నారు . ఇక పోతే శ్రీ విష్ణు తన నెక్స్ట్ మూవీ ని తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శ్రీ విష్ణు , గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడతల కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనలో ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv