మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రష్మిక గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే కన్నడ , తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితం రన్బీర్ కపూర్ హీరో గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో రూపొందిన యానిమల్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని 900 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. 

ఇకపోతే ఈ సినిమాలో రష్మిక తన నటనతో , అంతకు మించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ తో ఒక్క సారిగా రష్మిక క్రేజ్ బాలీవుడ్ లో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో భారీగా అందాలను ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే తాజాగా రష్మిక పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm