టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరో లలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రభాస్ మిర్చి సినిమా వరకు కేవలం తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరో గా కెరీర్ ను కొనసాగించాడు . ఎప్పుడైతే ప్రభాస్ , ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లలో నటించాడో అప్పటి నుండి ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. దానితో ప్రభాస్ బాహుబలి సినిమాల నుండి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా లలోనే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యింది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం కల్కి , రాజా సాబ్ అనే రెండు సినిమాలలో హీరో గా నటిస్తున్నాడు. అలాగే అందాల రాక్షసి సినిమాతో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ,  లై , పడి పడి లేచే మనసు ,  సీత రామం సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరిగా మారిపోయిన హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ప్రభాస్మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇకపోతే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా కాలమే ఉన్న హను రాఘవపూడి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలను రెడీ చేపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ గోవా లో జరుగుతున్నట్లు ... మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: