ఇప్పటికే ఎన్నో తెలుగు , తమిళ సినిమాలలో నటించి నటి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆండ్రియా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి సైంధవ్ అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. వెంకటేష్ హీరో గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇకపోతే తాజాగా ఆండ్రియా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో ఆమె తన పెళ్లి గురించి అనేక విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఆండ్రియా మాట్లాడుతూ ... నేను ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. ఎందుకు అంటే నాకు 25 సంవత్సరాలు ఉన్న సమయం లో పెళ్లి ఆలోచన వచ్చింది. ఆ సమయం లో పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నాను. కానీ ఎందుకో ఆ వయసులో పెళ్లి కుదరలేదు. ఇక ప్రస్తుతం నా వయసు 40 సంవత్సరాలు. ఇక ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలి అని లేదు.

నేను పెళ్లి చేసుకోకపోయినా చాలా సంతోషంగా ఉన్నాను. మిగతా జీవితం కూడా ఎంతో సంతోషంగా గడుపుతాను అనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అలాగే నాకు ఒంటరిగా జీవితాన్ని గడపడం అలవాటు అయిపోయింది అని తాజా ఇంటర్వ్యూ లో ఈ ముద్దు గుమ్మ తెలియజేసింది. ఇది  ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం ఈ నటికి వరుస పెట్టి తమిళ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: