మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మనుషి చిల్లర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... రూహాని శర్మ , నవదీప్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ రేపు అనగా మార్చి 1 వ తేదీన తెలుగు , హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ..? ఈ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్ సాధిస్తే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 2 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే ఈ సినిమా 18 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vt