సినిమా విడుదల అవుతుంది అన్న ఆ సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే కొంత ఎక్కువ షేర్ కలక్షన్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినట్లు అయితే ఆ సినిమాను హిట్ అంటారు. అలా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఏ సినిమా అయితే ఎక్కువ శాతం లాభాలను తెచ్చుకుంటుందో దానిని బట్టి ఆ సినిమా హిట్ స్థాయి నీ చెప్పవచ్చు. అలా పోయిన సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించిన సినిమాలు ఏవి ..? ఆ సినిమాలు ఏ స్థాయి విజయాలను సాధించాయి అనే విషయాలను తెలుసుకుందాం.

పోయిన సంవత్సరం ప్రారంభంలో విడుదల అయిన వాల్టేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లాభాలను అందుకొని బారి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన వీరసింహారెడ్డి మూవీ హిట్ సినిమాగా నిలిచింది. రైటర్ పద్మభూషణ్ సినిమా డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ధనుష్ హీరోగా రూపొందిన సార్ మూవీ డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కిరణ్ అబ్బావరం హీరోగా రూపొందిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా హిట్ సినిమాగా నిలిచింది. బలగం సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా ... దాస్ కా దమ్కీ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. దసరా మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. విరూపాక్ష మూవీ డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మేము ఫేమస్ సినిమా బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ అందుకుంది. సామజవరగమున సినిమా త్రిబుల్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బేబీ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా ... బెదురులంక 2012 సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకోగా ... మ్యాడ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. భగవంత్ కేసరి హిట్ సినిమాగా నిలవగా ... "పొలిమేర 2" సినిమా డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కోట బొమ్మాలి పిఎస్ హిట్ సినిమాగా నిలవగా ... హాయ్ నాన్న మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: