తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయక అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే 2017 వ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకు యూట్యూబ్ లో హిందీ లో ప్రసారం చేయడం మొదలు పెట్టారు.

మూవీ హిందీ వర్షన్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా హిందీ వర్షన్ కి యూట్యూబ్ లో 800 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇలా జయ జానకి నాయక హిందీ వెర్షన్ మూవీ యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డిమూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bs