పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి చిత్రాన్ని ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులకు చూపించారు. వారంతా కూడా అరి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి వారు కూడా అరి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సైతం సినిమాను చూసి మెచ్చుకున్నారు. అలా అరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నారు.

పేపర్ బాయ్ సినిమాను మన సమాజం నుంచి, మన నిత్యం చూసే మనుషుల జీవితాల నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అరి చిత్రానికి కాస్త భిన్నమైన లైన్‌ను, పాయింట్‌ను ఎంచుకున్నారు. మనిషిలో ఉండే అరిషడ్వర్గాల మీద, దానికి దైవత్వం అనే పాయింట్‌ను జోడిస్తూ ఓ ఫాంటసీ చిత్రంగా మలిచాడు దర్శకుడు జయ శంకర్. ఆరు పాత్రల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది.

తాజాగా అరి చిత్రంలోని మెయిన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వినోద్ వర్మకు సంబంధించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది.  పోస్టర్‌లో కనిపిస్తున్నట్టుగా ఆ లైబ్రరీ కథ ఏంటి? ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అంటూ కనిపించిన ఆ క్యాప్షన్ వెనుకున్న అర్థం ఏంటి? అసలు వినోద్ వర్మ పాత్ర ఏంటి? ఆ క్యాప్షన్ మధ్యలో ఓ నెమలి పించం ఎందుకు కనిపిస్తోంది? ఇలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: