స్టార్ యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు బుల్లి తెరని ఊపేస్తుంది. ఆమె ప్రస్తుతం ఫుల్‌ బిజీ గా ఉంది. ఆయన పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. తాజా గా దీనిపై స్పందించింది.యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు తెలుగు బుల్లి తెర యాంకర్ల లో అత్యంత బిజీ గా ఉన్న యాంకర్‌. ఒక ప్పుడు ఒకటి అర షోస్‌ తో కెరీర్‌ నెట్టుకొచ్చిన శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరని దున్నేసే స్థాయికి ఎదిగింది. ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు స్పెషల్‌ షోస్‌తో రచ్చ లేపుతుంది. చలాకీతనంతో, చురుకుతనంతో ఆకట్టుకుంటుంది.అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. అభినయంతో అలరిస్తుంది. శ్రీముఖి ప్రస్తుతం మూడు పదులు దాటింది. నాలుగు పదు ల్లోకి వెళ్తుంది.ఏజ్‌ పెరుగుతుంది, వయసు ముదిరిపోతుంది. అయినా పెళ్లి చేసుకోవడం లేదు. కెరీర్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో మ్యారేజ్‌ ఆలోచనే చేయడం లేదు. గతంలో లవర్‌ ఉన్నాడంటూ ప్రచారం జరిగింది.బ్రేకప్‌ అయ్యిందని కూడా ఓ షోలో చెప్పింది. కానీ అవన్నీ సరదాగా చెప్పిందా, నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల బుల్లితెర భామలు పెళ్లిలు చేసు కుంటున్నారు. సినిమా హీరోయిన్లు మ్యారేజ్‌లు చేసుకుంటున్నారు.

కానీ శ్రీముఖి మ్యారేజ్‌ గురించి మాట్లా డటం లేదు. తాజాగా ఆమెకి పెళ్లి ప్రశ్న ఎదురయ్యింది. ఓ రిపోర్టర్‌ పెళ్లిపై క్లారి టీ ఇవ్వాలని అడగ్గా శ్రీముఖి ఓపెన్‌ అయ్యింది. పెళ్లి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.నాకు వయసు పెరుగుతూనే ఉంది, పెళ్లి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంట్లో పేరెంట్స్ ప్రెజర్‌ ఉందని అంటున్నారు. కానీ పేరెంట్స్ నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. వాళ్లు పెళ్లి గురించి చెప్పింది ఒక్కటే, నువ్వు షోస్‌ చేస్తున్నావు, నీ రంగంలో నువ్వు ముందు కు వెళ్తున్నావు, అలానే వెళ్లు, నీకు చేసుకోవాలని పించినప్పుడు చేసుకో, మేం బలవంత పెట్టం` అని చెప్పారు. తనకు మ్యారేజ్‌ విషయంలో ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: