యంగ్ హీరోలలో ప్రయోగాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ఉన్న హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు.. ఈసారి సరికొత్త విభిన్నమైన సబ్జెక్టుని సైతం ఎంచుకుంటూ అఘోర పాత్రలో కనిపించబోతున్నారు. అగోరగా విశ్వక్ సేన్ గెటప్ అందరిని ఆకట్టుకుంటోంది.దాదాపుగా నాలుగు నిమిషాల సుదీర్ఘ ట్రైలర్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు విశ్వక్.. ఇందులో ఒక అరుదైన వ్యాధితో బాధపడే అఘోర పాత్రలో కనిపించబోతున్నారు.. గామి సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ను కూడా చిత్ర బృందం విడుదల చేశారు వాటి గురించి చూద్దాం.


36 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూసే పూల కోసం విశ్వక్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది.ఈ సాహస యాత్రల సహకారం అందించే అమ్మాయిగా చాందిని చౌదరి ఉండబోతోంది.. అద్భుతమైన విజువల్స్ తో చాలా ఉన్నతంగా ఇందులోని పాత్రలు కనిపిస్తున్నాయి హాలీవుడ్ రేంజ్ లో గామి ట్రైలర్ తలపిస్తోందని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.. మూఢాచారాలు కథతో ఈ సినిమాని జోడించినట్టుగా కనిపిస్తోంది.. అసలు ఈ సినిమాలో విశ్వక్ ఎవరు ఈ కథలో ట్విస్టు మొత్తం ఏమీ అనే విషయాన్ని తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే..


మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ విద్యాధర్ తెరకెక్కిస్తున్నారు.. ఎన్ డైరెక్టర్ అయినప్పటికీ ఒక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. ఈ సినిమాతో పాటు విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు ఈ సినిమా కూడా పీరియాడిక్ విలేజ్ గ్రామ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా వేశారు.. మరి గామి సినిమాతో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి విశ్వక్.. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ మాత్రం అందరిని ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: