కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మణిరత్నం తరువాత టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వ్యక్తి ఎవరు అంటే ఎవరికైన వెంటనే గౌతమ్ మీనన్ పేరు గుర్తుకు వస్తుంది. ‘చెలి’ ‘ఏమాయ చేసావె’ ‘ఎటో వెళ్లిపోయింది’ లాంటి ప్రేమకథలను నెటితరం ప్రేక్షకులకు నచ్చేవిధంగా గౌతమ్ మీనన్ చాల గొప్పగా తీశాడు అన్న పేరు రావడంతో ప్రస్తుతం కొందరు టాప్ హీరోలు గౌతమ్ మీనన్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ విలక్షణ దర్శకుడు తీసిన ‘ధృవనక్షత్రం’ మూవీని ఎలాగైన విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆప్రయత్నాలు ముందుకు సాగడంలేదు అన్న వార్తలు కోలీవుడ్ మీడియా వరాస్తోంది. తమిళ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈమూవీ రకరకాల కారణాలతో విడుదల ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. ఇక్కడితే ఆగకుండా అతడు నిర్మాతగా మరి సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకుని కొన్ని సినిమాలను వరసగా తీయాలని చేసిన ప్రయత్నాలు కూడ ముందుకు సాగడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.విక్రమ్ హీరోగా నటించిన ‘ధృవనక్షత్రం’ను ఎలాగైనా రిలీజ్ చేయాలని కొన్ని నెలలుగా గట్టి ప్రయత్నo గౌతం మీనన్ చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగకపోవడంతో నిరాశకు లోనైన గౌతం మీనన్ తన ఆవేదనను చాల డిఫరెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  

“ఇది హార్ట్ బ్రేకింగ్‌గా అనిపిస్తోంది. సినిమా వాయిదా విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదు. నా కుటుంబం ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయమే ఆలోచిస్తోంది. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ ఇన్వెస్టర్లకు సమాధానం చెప్పాలి కాబట్టి ఉంటున్నా. మార్చి 1న నా సినిమా ‘జాషువా’ విడుదల కానుంది. ఆలోపే ‘ధృవనక్షత్రం’ను రిలీజ్ చేయాలని చూశాను. కానీ కుదరలేదు” అంటూ ఈ విలక్షణ దర్శకుడు షేర్ చేసిన అతడి కష్టాలు అతడి అభిమానులకు  బాధను కలిగితస్తున్నాయి. నిర్మాతగా కష్టాలు ఎదురావుతున్నప్పటికీ గౌతమ్ మీనన్ విలక్షణ నటుదా తన హవా ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే..      

మరింత సమాచారం తెలుసుకోండి: