ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ లో ట్రెండ్ జోరుగా ముందుకు సాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఏదైనా సన్నివేశం దొరికింది అంటే చాలు మూవీ బృందాలు గతంలో విజయాలను సాధించిన సినిమాలను ... గతంలో విజయాలను సాధించకపోయినా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు తెచ్చుకున్న సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన విజయాలను అందుకున్న మూడు సినిమాలు రీ రిలీస్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన సమరసింహా రెడ్డి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ ని ఈ రోజు థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి సినిమా ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందో మన అందరికీ తెలిసింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఈ సినిమాను ఈ రోజు తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ హీరో గా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం కిక్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ టైమ్ లో అద్భుతమైన విజయం సాధించింది. ఇకపోతే ఈ సినిమాను తిరిగి మళ్లీ ఈ రోజు థియేటర్ లలో రీ రిలీజ్ చేస్తున్నారు.

మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: