తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభంలో నాని , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో అష్టా చమ్మా అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది.

మూవీ తో ఇంద్రగంటి మోహన కృష్ణ కు కూడా సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఆ తర్వాత నాని , ఇంద్రగంటి కాంబో లో జెంటిల్మెన్ , వి అనే సినిమాలు రూపొందాయి. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఇంద్రగంటి మోహన కృష్ణ , సుధీర్ బాబు హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ ని రూపొందించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఇంద్రగంటి మోహన కృష్ణ తాజాగా ఓ నటుడి తో సినిమాను సెట్ చేసుకున్నాడు. ఇక అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియదర్శి హీరో గా ఇంద్రగంటి మోహన కృష్ణ తన తదుపరి మూవీ నీ చేయబోతున్నాడు. ఈ మూవీ ని శ్రీదేవి మూవీస్ వారు నిర్మించనున్నారు. ఇకపోతే ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ నెల నుండే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ చిత్ర బృందం మరి కొంత కాలం లోనే విడుదల చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

imk