మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే నాగ బాబు మెగా ఫ్యామిలీ సభ్యులను ఎవరినైనా ఏమైనా అంటే తనదైన రీతిలో వారిని విమర్శిస్తూ అనేక వ్యాఖ్యలను చేస్తూ ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా అనేక సార్లు చిరంజీవి , పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే నాగబాబు తనదైన రీతిలో వారి వ్యాఖ్యలను ఖండించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇకపోతే తాజాగా నాగబాబు కుమారుడు అయినటువంటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ "ఆపరేషన్ వాలెంటైన్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ రోజు అనగా మార్చి 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయమన్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితం ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నాగ బాబు మాట్లాడుతూ ... సినిమాల్లో పోలీస్ పాత్రాలను ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది కానీ 5 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే అస్సలు బాగోదు అని అన్నాడు.

దీనితో ఈయన చేసిన వ్యాఖ్యలను చాలా మంది ఖండించారు. దానితో నాగబాబు తాజాగా స్పందిస్తూ ... నేను ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పోలీస్ పాత్రలు చేసేందుకు గల ఎత్తు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాను. అవి నేను ఎవరినో ఉద్దేశించి చేసినవి కాదు. కానీ ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఆ విషయంలో నేను పలికిన మాటలు అన్ని నిజంగానే నన్ను బాధ పెడుతున్నాయి అని తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నట్లు నాగ బాబు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: