తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె స్టార్ మాలో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ తో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.ఈ సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యింది. ఈ సీరియల్ కంటే ముందు పలు సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు ఈ ఒక్క సీరియల్ తో దక్కింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా శోభా ఇటీవలే తెలుగులో ముగిసిన బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె హౌస్ లో 11 వారాలకు పైగా రాణించి ఈ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.అయితే శోభా శెట్టికి బిగ్ బాస్ ఎంత క్రేజ్ తీసుకువచ్చిందో అదే స్థాయిలో నెగిటివిటి కూడా మూటగట్టుకుంది. చిన్న విషయాలకు కూడా గొడవ పడడం, ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకపోవడం, తానే సాధించాలి అనే పంతం శోభా శెట్టిపై ట్రోలింగ్ జరిగేలా చేశాయి. అయితే అందరికంటే ఎక్కువ నెగిటివిటీతో శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చింది. అయితే తాజాగా శోభా శెట్టి తన సొంత ఇంటి కల నెరవేర్చుకుంది. ఏడాదిన్నర క్రితమే ఆ ఇంటిని శోభా శెట్టి కొన్నప్పటికీ రీసెంట్ గా అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున ఇంటి తాళాలని శోభా పొందింది.తన తల్లి, ప్రియుడు కాబోయే భర్త యశ్వంత్ తో కలసి కొత్త ఇంట్లోకి వెళ్ళింది. కాగా శోభా బుల్లితెర నటుడు యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ వేడుకలు చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే శోభా శెట్టి ప్రస్తుతం సీరియల్స్ లో కనిపించడం లేదు. బిగ్ బాస్ షో అనంతరం ఆమె నటన పట్ల ఆసక్తి చూపడం లేదు.   ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆలోచనలు అమలులో పెట్టడం స్టార్ట్ చేసింది.బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక శోభ శెట్టి ఒక టాక్ షో చేస్తోంది. సుమన్ టీవీలో కాఫీ విత్ శోభ శెట్టి పేరుతో ఈ టాక్ షో ప్రసారం అవుతుంది. పలువురు సెలెబ్స్ ని ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఎలాంటి సీరియల్స్ ఒప్పుకోలేదు.ఆమె ఒక మేకప్ స్టూడియో పెట్టింది. తనకు మేకప్ పై అవగాహన ఉన్న నేపథ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించాలని ఆమె భావిస్తున్నారు. తాజాగా మరో బిజినెస్ స్టార్ట్ చేసింది. సూరత్ వెళ్లిన శోభా శెట్టి అక్కడ హోల్ సేల్ కి చీరలు కొన్నది.ఆ చీరలు తన మేకప్ స్కూల్ వచ్చే కస్టమర్స్ కి అమ్మాలి అనుకుంటుందట. రిటైల్ అండ్ హొల్ సేల్ గా చీరలు అమ్మాలని ఆమె నిర్ణయం తీసుకుందట. ఈ క్రమంలో నటనకు గుడ్ బై చెప్పిన శోభ శెట్టి బిజినెస్ పై దృష్టి పెట్టింది. సీరియల్స్ లో నటించడం వలన వచ్చే ఆదాయం తక్కువే కాబట్టి బిజినెస్ బెటర్ అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: