టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ తమన్నా భాటియా.. ప్రస్తుతం సరికొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది.. తన ప్రతి సినిమాలో కూడా ఒక వైపు కమర్షియల్ సినిమాలను చేస్తూ.. మరొకవైపు పలు రకాల లేడి ఓరియెంటెడ్ చిత్రాలను చేయడానికి మక్కువ చూపుతూ ఉంటుంది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్త సినిమాలో నటిస్తోంది.. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్ గా ఉండగా.. అశోక్ తేజ అనే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ప్రకటన ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు చిత్ర బృందం. ఈ సినిమా టైటిల్ ను  ఓదెల-2 అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టుని తీసుకురాబోతున్నారు.2022 లో ఓటీటీ లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.. ఈ చిత్రం  హెబ్బా పటేల్ కెరీర్ ని మరొకసారి సక్సెస్ బాట పట్టేలా చేసింది. ఈ చిత్రానికి  కథను సంపత్ నంది అందించారట.. డైరెక్టర్ అశోక్ తేజ మేకింగ్ తో ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.

అయితే ఈసారి అదే టీం తో ఓదెల-2 అనే టైటిల్ తో మరొక ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈసారి అంతకుమించి కథాంశం తో భారీ క్యాస్టింగ్ తో సరికొత్త టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజున అధికారికంగా ఈ సినిమాని లాంచ్ చేస్తూ రెగ్యులర్ షూటింగ్ ను  త్వరలోనే మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు.

సినిమా స్టోరీ విషయానికి వస్తే ఓదెల మల్లన్న స్వామి ఒక గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి రక్షిస్తారనే కథాంశంతో తెరకెక్కించబోతున్నారట.. టైటిల్ పోస్టర్ లో  త్రిశూలంలో శివుడు బొట్టు చాలా హైలైట్ గా కనిపిస్తోంది.. ఈ చిత్రానికి కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.. ఓదెలా -2 లో హెబ్బా పటేల్, వశిష్ట ,వంశి, సురేందర్ రెడ్డి ,పూజా రెడ్డి,తమన్నా తదితరులు నటిస్తూ ఉన్నారు. మరి తమన్న ఈ చిత్రంలో ఏ విధంగా నటిస్తుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: