నాపై కేసు వేసిన వాళ్ళు చాలా బలవంతులు. అలాంటి సమయంలో సుమన్ చాలా మంచి వ్యక్తి అంటూ భానుప్రియ, సుమలత, సుహాసిని గారు నా కోసం ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు.సీనియర్ నటుడు సుమన్ ఒకప్పుడు తిరుగులేని హీరోగా రాణించారు. సుమన్ క్రమంగా స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయన జీవితాన్ని కొన్ని వివాదాలు కుదిపేశాయి. ఫలితంగా సుమన్ తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే సుమన్ ఎదుర్కొన్న కేసుల గురించి జనాల్లో అనేక పుకార్లు ఉన్నాయి. ఆ పుకార్ల కారణంగా సుమన్ పై చాలా అసత్యమైన నిందలు పడ్డాయి. సుమన్ స్టార్ హీరో అయ్యేందుకు అర్హతలు ఉన్న నటుడు.కానీ తన జీవితంలో ఎదురైన సంఘటనల వల్ల టాప్ పొజిషన్ కి చేరుకోలేకపోయారు. కానీ నటుడిగా సుమన్ ఇప్పటికీ రాణిస్తున్నారు. అయితే సుమన్ కి జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పటికి అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది. సుమన్ నటుడిగా రాణిస్తున్న పీక్ టైంలో 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దీనికి కారణం బ్లూ ఫిలిం కేసు అని అసత్యమైన ఆరోపణలు సృష్టించారు. కానీ ఇదంతా జరిగింది అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్, డిజిపి, లిక్కర్ వల్లే అని నిజాలు బయటకి వచ్చాయి.తాజాగా ఇంటర్వ్యూలో సుమన్ అప్పటి పరిస్థితులని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సంఘటన జరిగినప్పుడు కొందరు హీరోయిన్లు బహిరంగంగా తనకి మద్దతు ఇచ్చినట్లు సుమన్ గుర్తు చేసుకున్నారు.

 నాపై కేసు వేసిన వాళ్ళు చాలా బలవంతులు. అలాంటి సమయంలో సుమన్ చాలా మంచి వ్యక్తి అంటూ భానుప్రియ, సుమలత, సుహాసిని గారు నా కోసం ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. సుమన్ చాలా మంచి వ్యక్తి. క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయనంటే మాకు చాలా గౌరవం. ఇప్పుడు వస్తున్న ఆరోపణలన్నీ బ్యాడ్ టైం వల్లే.. ఏదో కుట్ర జరిగింది అని వాళ్ళు కుముదం అనే ఫేమస్ తమిళ మ్యాగజైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు.అది నాకు చాలా బలాన్ని ఇచ్చింది. వాళ్ళ ఇంటర్వ్యూ బాగా సర్కులేట్ అయింది. దీనితో అభిమానుల్లో నాపై ఉన్న అపోహలన్నీ తొలిగిపోయాయి. పేపర్ కటింగ్స్ తో ఫ్యాన్స్ నాకు సోపోర్ట్ ఇచ్చారు. అప్పట్లో తెలుగు మీడియా కూడా నాకు అండగా నిలబడింది. తమిళ మీడియాకి న రేంజ్ ఏంటో తెలియదు. ఎందుకంటే అప్పుడు నాకు అన్ని సూపర్ హిట్ చిత్రాల్లో తెలుగులో చేసినవే అని సుమన్ అన్నారు.తెలుగు మీడియా నేను ఎలాంటి నటుడినో.. ఎంత మంచి చిత్రాలు చేస్తున్నానో వివరిస్తూ రాశారు. హీరోయిన్లపై నాకున్న గౌరవం గురించి కూడా రాశారు. సుమన్ అంటే చాలా మంది హీరోయిన్లకు ఇష్టం.. ఆయన తలుచుకునే పడుకోవడానికి చాలా మంది వస్తారు. ఇలాంటివి చేయాల్సిన అవసరం సుమన్ కి లేదు అంటూ మీడియా సపోర్ట్ ఇచ్చినట్లు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే విధంగా తనకి అప్పట్లో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉండేవని.. కానీ ఎవరి పరిచయాన్ని తాను అడ్వాంటేజ్ తీసుకోలేదు అని సుమన్ తెలిపారు. శోభన్ బాబు గారి కుమార్తె మృదుల.. మా అమ్మ దగ్గర స్పెషల్ క్లాసుల కోసం స్టూడెంట్ గా వచ్చేవారు. ఆమెతో నాకు పరిచయం ఉంది. కానీ ఆమెతో ఉన్న పరిచయాన్ని ఎప్పుడూ మిస్ యూజ్ చేయలేదని సుమన్ తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె కూడా తనకి తెలుసు అని తెలిపారు. శోభన్ బాబు గారితో కూడా నటించా. ఆయన జీవితం గురించి చాలా విషయాలు నేర్పించేవారు. శోభన్ బాబు తన అనుభవంతో చాలా విషయాలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: