ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్నకొడుకు అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి..అనంత్ అంబానీ పెళ్లి కోసం దేశంలోని సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లనుంది. అతని పెళ్లికి ఆహ్వానం అందుకున్న వారిలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లతోపాటు అన్ని సినిమా ఇండస్ట్రీల ప్రముఖులు ఉన్నారు. షారుక్ ఖాన్, దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, రామ్ చరణ్ లాంటి వాళ్లంతా ఈ పెళ్లికి వెళ్లనున్నారు.ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.. ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు.. టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది..

గత నెల 28 నుంచి ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ ఈవెంట్ కి వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ వంటి ఇంటర్నేషనల్ పర్సన్స్ అతిథులుగా రావడంతో.. ఈ ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ వైరల్ అవుతుంది.. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి ఇండియాలోని టాప్ స్టార్స్ కి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్స్ ఈ సెలబ్రేషన్స్ కి గెస్ట్‌లుగా హాజరవుతున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో సహా కలిసి ఇప్పటికే జామ్ నగర్ కు చేరుకున్నారు.అయితే ఈ క్రమంలో రామ్ చరణ్ అండ్ ఉపాసనకి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్విటేషన్ అందిందని, వారు ఇద్దరు కూడా ఆ సెలబ్రేషన్స్ కి వెళ్ళబోతున్నారని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.ఇక ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ పూర్తి అయిన తరువాత రోజు అతిథులతో జంగల్ సఫారీ ఈవెంట్ ఉండబోతుంది. ఆ నెక్స్ట్ డే జామ్‌నగర్ ప్రకృతి అందాలను అతిథులకు చూపించనున్నారు.. ఈ ఈవెంట్స్ కు ఎవరెవరు గెస్టులు గా రాబోతున్నారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: