టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో కామెడీ ప్రాధాన్యత ఎక్కువ కలిగిన సినిమాలలో నటించి అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరో గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే సుడిగాలి సినిమా వరకు అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ఆ తర్వాత నటించిన సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు.

ఇలా చాలా సంవత్సరాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలను ఎదుర్కొన్న నరేష్ ఆ తర్వాత కామెడీ పాత్రలలో కాకుండా వైవిధ్యమైన పాత్రలలో నటించడానికి ప్రాముఖ్యతను ఇవ్వడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా నాంది అనే వైవిధ్యమైన సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటి నుండి ఈయన వరుసగా వైవిధ్యమైన సినిమాల లోనే హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇలా చాలా కాలంగా కామెడీ పాత్రలకు దూరంగా ఉన్న నరేష్ తన పాత స్టైల్ లో మళ్లీ ఆ కామెడీ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోని ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాలోని "హో మేడం" అంటూ సాగే మొదటి పాట ప్రోమోను విడుదల చేశారు. అలాగే ఈ మూవీ లోని మొదటి పూర్తి పాటను మార్చి 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: