హెబ్బా పటేల్ , పూజిత పొన్నాడ , వశిష్ట ఎన్. సింహా , సాయి రోనక్ ప్రధాన పాత్రలలో అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి కథను తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సంపత్ నంది అందించాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే కే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా ...  అనుప్ రూబెన్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 2022 వ సంవత్సరం లో విడుదల అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా డైరెక్ట్ గా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. దానితో ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా "ఓదెల 2" అనే మూవీ ని రూపొందించబోతున్నారు. ఓదెల రైల్వే స్టేషన్ మూవీ కి కథను అందించిన సంపత్ నందిమూవీ ని నిర్మించబోతున్నాడు. ఇకపోతే "ఓదెల 2" లో తమన్నా ప్రధాన పాత్రలో నటించబోతోంది. ఈ మూవీ నిన్న అనగా మార్చి 1 వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇప్పటికే ఓదెల రైల్వే స్టేషన్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో ఆ మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న మూవీ కావడంతో "ఓదెల 2" సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: