తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ కు జోడి గా నటించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ , గెటప్ శీను , సత్య ముఖ్య పాత్రలలో నటించగా ... వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి "జీ 5" సంస్థ దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ సినిమాని మార్చి 8 వ తేదీ నుండి స్ట్రీమింగ్ బోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా "జీ 5" ఓ టి టి సంస్థ వారు మరో ఒకటి , రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే "హనుమాన్" మూవీ కి కొనసాగింపుగా "జై హనుమాన్" మూవీ ఉండబోతుంది అని ఇప్పటికే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: