ప్రముఖ భోజ్పూరి నటుడు రవి కిషన్ గురించి ప్రత్యేకం గా తెలుగు సునీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటుడు భోజ్పురి ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడుగా ప్రస్తుతం కెరియర్ ను కొనసాగిస్తున్నాడు . ఇక పోతే ఈయన ఇప్పటికే తెలుగు లో చాలా సినిమాలలో నటించాడు. ఈయన ఎక్కువ శాతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా లలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించు కున్నాడు.

ఈయన కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన రేసుగుర్రం సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర లో నటించి సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన "కిక్ 2" మూవీ లో కూడా ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు.

ఇలా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్న ఈయన తాజాగా తెలుగు సినీ పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించాడు ... తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రవి కిషన్ మాట్లాడుతూ భోజ్పురి ఇండస్ట్రీ అనగానే చాలా మంది అశ్లీలత అని అనుకుంటున్నారు. ఇక్కడ సరైన మూవీలు ఉండవని భావిస్తున్నారు. భోజ్పురి ఆల్బమ్ లు , ప్రైవేట్ సాంగ్స్ ఇండస్ట్రీ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. టాలీవుడ్ లో ఇలాంటి చెత్త పాటలు , అసభ్య డైలాగ్ లు , చీప్ సన్నివేశాలు ఉండవు. ఈ విషయంలో భోజ్పూరి ఇండస్ట్రీ రాజమౌళి సలహాలు తీసుకోవాలి అని రవి కిషన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk