హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో షాహిద్ కపూర్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన తెలుగు లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేశాడు. ఈ మూవీ బాలీవుడ్ లో కూడా సూపర్ విజయాన్ని సాధించడంతో ఈ మూవీ తో షాహిద్ కపూర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక ఆ తర్వాత ఈ నటుడు తెలుగు లో సూపర్ సక్సెస్ అందుకున్నటువంటి జెర్సీ మూవీ ని హిందీ లో ఇదే పేరుతో రీమేక్ చేశాడు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడి చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే షాహిద్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో ఆయన కెరియర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న సమస్యలను గురించి ... పడ్డ అవమానాల గురించి వివరించాడు.

షాహిద్ కపూర్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అంత తొందరగా అవకాశాలు దక్కవు. నా పేరెంట్స్ సినిమా నటులే అయినప్పటికీ వాళ్ల  పేరు వాడుకోకుండా నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. దానితో క్లియర్ తొలినాళ్లలో నన్ను కొందరు హీనంగా చూశారు. అలాంటి సమయాల్లో నేను ఎంతో బాధపడ్డాను. అవకాశాల కోసం బాలీవుడ్ గ్యాంగ్ లో తిరిగే టైపు మనిషిని నేను కాదు. టీనేజ్ లో నేను ఎక్కువగా పోరాడలేకపోయా. ఇప్పుడు ఎవరైనా నన్ను వేధించాలని చూసిన ... ఇతరులను ఇబ్బంది పెట్టిన చూస్తూ ఊరుకోను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: