మోస్ట్ బ్యూటిఫుల్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో రూపొందిన కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మహిళా క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినప్పటికీ ఈ సినిమాలోని తన నటనతో ఐశ్వర్య రాజేష్ మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

ఇలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ లోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ కి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తెలుగు , తమిళ భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ మంచి జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎక్కువగా స్కిన్ షో చేయకుండా చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలలో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అలాంటి ఫోటోలనే ఎక్కువ శాతం పోస్ట్ చేస్తూ వస్తోంది. 

అందులో భాగంగా తాజాగా మరోసారి ఈ బ్యూటీ డీసెంట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ బ్లాక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: