హా.హా.. హాసిని అంటూ తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్‏గా నిలిచిపోయింది హీరోయిన్ జెనీలియా. బొమ్మరిల్లు తో ఫ్యామిలీ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.బాయ్స్ తో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ… ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్ పోతినేని , విష్ణు, రామ్ చరణ్ వంటి స్టార్స్ అందరి సరసన నటించింది. కానీ సిద్ధార్థ్ హీరోగా భాస్కర్ తెరకెక్కించిన బొమ్మరిల్లు తో జెనీలియా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. చలాకీతనం, అమాయకత్వంతో కూడిన పాత్రలో ఒదిగిపోయి అందరినీ ఆకట్టుకుంది. ఆరెంజ్ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గినా.. క్రేజ్ మాత్రం మారలేదు. హిందీలో వరుస మూవీస్ చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‏ముఖ్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తర్వాత లకు పూర్తిగా దూరమైంది జెనీలియా. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది.

గతేడాది తన భర్తతో కలిసి వేద్ లో నటించింది. ఈమూవీతోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగులో సమంత, నాగచైతన్య కలిసి నటించిన మజిలీ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. నార్త్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకుని అత్యధిక వసూళ్లు రాబట్టింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది జెనీలియా. తన భర్త, పిల్లలతో కలిసి సరదాగా ఉన్న ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ఇక తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ తో కలిసి డాన్స్.. అల్లరి వీడియోస్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. గతంలో సల్మాన్ ఖాన్ తో కలిసి డాన్స్ అదరగొట్టేసింది జెనీలియా. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలయ్యింది. ఇప్పుడు జెనీలియా మరో ఎనర్జిటిక్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

క్రికెట్ గ్రౌండ్‏లో తన భర్తతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేసింది. ఈ వీడియోను జెనీలియా ఫ్యాన్స్  లో షేర్ చేశారు. అయితే వీడియో చూస్తే.. ప్రస్తుతం జరుగుతున్న సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మ్యాచ్ ఆడుతున్న తన భర్తను ఎంకరేజ్ చేసేందుకు జెనీలియా డాన్స్ చేసింది. ఆమెతోపాటు రితేశ్ కూడా తన భార్యతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ జెనీలియా ఎనర్జీ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ మా హసిని ఏం మారలేదని సంబరపడిపోతున్నారు. జెనీలియా, రితేశ్ డాన్స్ చూసి ముచ్చటపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ వీరిద్దరూ ఎప్పుడూ అలాగే సంతోషంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: