జగపతి బాబు-సౌందర్య మధ్య ఎఫైర్ నడిచిందని టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. వీరిద్దరూ కలిసి పలు చిత్రాలు చేశారు. ఓ సందర్భంలో సౌందర్యతో నాకు ఎఫైర్ ఉందని జగపతిబాబు అన్నారు.అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో సౌందర్య ఫ్రెండ్ ఆమని చెప్పుకొచ్చింది...కన్నడ అమ్మాయి అయిన సౌందర్యను తెలుగువాళ్లు విపరీతంగా ఇష్టపడ్డారు. సౌందర్య అందం, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సౌందర్యను తమ ఇంట్లో అమ్మాయిగా ఆడియన్స్ భావించేవారు. హీరోలకు సమానమైన స్టార్డం అనుభవించిన హీరోయిన్ సౌందర్య.ఆమె స్టార్ హీరోలతో నటిస్తూనే మరో ప్రక్క జగపతిబాబు, శ్రీకాంత్ వంటి టైర్ టు హీరోల పక్కన కూడా చేసింది. ముఖ్యంగా ఆమె జగపతిబాబుతో ఎక్కువ సినిమాల్లో నటించింది. వీరి కాంబినేషన్ లో చిలకపచ్చ కాపురం, భలే బుల్లోడు, దొంగాట, ప్రియ రాగాలు, అంతఃపురం.. ఇలా పలు చిత్రాలు తెరకెక్కాయి.జగపతిబాబు, సౌందర్య వరుస సినిమాలు చేస్తుండగా... ఇద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ గుప్పుమన్నాయి. అప్పటికే జగపతిబాబుకు పెళ్ళై పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ సౌందర్యను మరో వివాహం చేసుకోనున్నాడని కథనాలు వెలువడ్డాయి.

ఈ పుకార్ల మీద సౌందర్యకు అత్యంత సన్నిహితురాలైన హీరోయిన్ ఆమని క్లారిటీ ఇచ్చింది. ఆమని మాట్లాడుతూ... సౌందర్య, జగపతిబాబు మధ్య అలాంటి బంధం ఏమీ లేదు. కలిసి ఎక్కువ సినిమాలు చేయడం వలన ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. సౌందర్యకు కుటుంబం తర్వాతే ఎవరైనా. ఆమె చాలా మంచిది.సౌందర్య నాన్న చనిపోయినప్పుడు ఫోన్ చేసి రమ్మని ఏడ్చింది. తండ్రి దూరం అయ్యాక తనకు అన్నయ్యనే అన్నీ. అన్నయ్య మాట వినేది. అన్నయ్య చెప్పాడనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సౌందర్య మరణవార్త విని నేను చలించిపోయాను. ఆమెను ఉంచి దేవుడు నన్ను తీసుకెళ్లినా బాగుండేది అనిపించింది... అని ఆమని అన్నారు.కాగా సౌందర్యతో నాకు ఎఫైర్ ఉందని జగపతిబాబు ఓ సందర్భంలో ఒప్పుకోవడం విశేషం. అయితే ఆ ఎఫైర్ మీరు అనుకున్నట్లు శారీరక సంబంధం కాదు. ఎవరికీ అర్థం కాని ఒక అనుబంధం తమ మధ్య ఉందని జగపతిబాబు అన్నారు.2004లో సౌందర్య విమాన ప్రమాదంలో మరణించింది. ఆమెతో పాటు అన్నయ్య కూడా కన్నుమూశాడు. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య ఎన్నికల ప్రచారం కోసం బెంగుళూరు నుండి కరీంనగర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: