తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో బాల ఒకరు. ఈయన శివ పుత్రుడు అనే సినిమాకు దర్శకత్వం వహించి ఈ మూవీ తో అద్భుతమైన గుర్తింపును తమిళ సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో బాల కి దర్శకుడికి తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో వాడు వీడు సినిమా అటు తమిళ్ ... ఇటు తెలుగు రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించినా కూడా ఆ సినిమాలు ఏవి కూడా చెప్పుకోదగ్గ విజయాలను అందుకోలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన సూర్య హీరోవ్గా మమిత హీరోయిన్ గా ఓ మూవీ ని ప్రారంభించాడు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా నుండి సూర్య తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న మమిత కూడా తప్పుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ దర్శకుడు బాల నన్ను కొట్టినట్టు ఈ ముద్దుగుమ్మ చెప్పినట్లు అనేక వార్తలు వచ్చాయి.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మరో ఇంటర్వ్యూలో ఆ వార్తలకి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చింది. నేను ఓ మూవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన దాంట్లో ఒక చిన్న అంశాన్ని కొంత మంది చాలా పెద్దది చేశారు. బాల సార్ నన్ను ఫిజికల్ గా , మానసికంగా హింసించలేదు. ఆయన సినిమాకు ఏడాది పాటు పని చేసే ఈ క్రమంలో నటనను మెరుగుపరుచుకున్నా. వేరే సినిమాలు ఉండడం వల్లనే ఆ సినిమా చేయడం కుదరలేదు అని వివరణ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: