కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరో లలో కార్తీ ఒకరు . ఈయన ఇప్పటి వరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు . ఇక పోతే ఈ నటుడు యుగానికి ఒకడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇక అప్పటి నుండి దాదాపుగా ఈయన నటించిన ప్రతి సినిమాను తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే కార్తీ కెరియర్ లో సూపర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీ లలో ఖైదీ సినిమా ఒకటి. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందు కుంది.

ఇకపోతే ఈ సినిమా చివరలో ఖైదీ కి సీక్వెల్ ఉండబోతున్నట్లు మూవీ బృందం వారు ప్రకటించారు. కానీ ఈ సినిమా విడుదల ఇన్ని రోజులు అవుతున్న ఈ సినిమాకు సీక్వెల్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇకపోతే తాజాగా ఓ కాలేజీ ఈవెంట్ లో పాల్గొన్న కార్తి ఖైదీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ ను ఇచ్చాడు. "ఖైదీ 2" మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలు పెట్టబోతున్నాము అని తెలియజేశాడు. ఇలా "ఖైదీ 2" మూవీ గురించి కార్తి అప్డేట్ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: