మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కొన్ని సంవత్సరాల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన నటిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ నటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న "కల్కి 2898 ఏడి" అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. అలాగే సూర్య హీరో గా శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువా అనే భారీ బడ్జెట్ సినిమాలో కూడా ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ తాను ఈ స్థానంలో ఉండడానికి కారణం అయిన వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో దిశా పటాని మాట్లాడుతూ ... నేను ఈ రోజు నటిగా ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం నిర్మాత కరణ్ జోహార్ అని తెలియజేసింది. నేను మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు నన్ను గుర్తించింది ఆయనే. అప్పుడు నా వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో నన్ను ఆయన గుర్తించి ఉండకపోతే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఇది ఆయన నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను అని దిశా పటాని ,  కరణ్ జోహార్ గురించి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

dp