ఏదైనా సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లాలి అంటే వారు నటించిన సినిమాలు అదిరిపోయే రేంజ్ విజయాలను సాధించాలి. నటించిన సినిమా లలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించినట్లు అయితే వారికి వేరే సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతాయి. దానితో వారు ఫుల్ బిజీ నటీమణులు అయిపోయి ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోతారు. ఇకపోతే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్న ముద్దు గుమ్మలలో ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఒకరు.

ఈ ముద్దు గుమ్మ నాని హీరోగా రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించలేదు. అయిన ఈ ముద్దు గుమ్మకు మంచి క్రేజ్ తెలుగు పరిశ్రమలో లభించింది. ఆ తర్వాత శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ పై ఇంట్రెస్ట్ పెట్టిన ఈ నటి మళ్లీ తిరిగి తెలుగు సినీ పరిశ్రమపై తన ఫుల్ ఫోకస్ ను పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం ప్రియాంక ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "ఓజి" మూవీ లోనూ ... నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందుతున్న సరిపోద్దా శనివారం సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఒక వేళ ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నట్లు అయితే ప్రియాంక క్రేజ్ ఒక్క సారిగా తెలుగు శని పరిశ్రమలో పెరుగుతుంది. ఈ రెండు సినిమాలు విజయాలను సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

prm