ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలలో "ఓజి" మూవీ ఒకటి. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తూ ఉండగా ... యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో పవన్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఎంతో భారీ బడ్జెట్ లో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే సెప్టెంబర్ 27బ్వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం వారు ఈ మూవీ నుండి ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ గ్లిమ్స్ వీడియోలో పవన్ బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ , డ్రెస్సింగ్ స్టైల్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అలాగే ఈ గ్లిమ్స్ వీడియోకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ చిన్న వీడియో అదిరిపోయే రేంజ్ లో ఎలివేట్ అయింది. ఈ వీడియో సూపర్ గా ఉండడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగి పోయాయి.

ఇకపోతే ఇలా గ్లిమ్స్ వీడియోలోనే అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ అందించిన తమన్ ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని హైలైట్ గా చేసేందుకు ప్రస్తుతం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.  ఈ సినిమాలోని వర్క్ తమన్ కెరియర్ లోనే బెస్ట్ వర్క్ గా ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత పవన్ "ఓజి" మూవీ లో గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తూ ఉండడంతో కూడా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో పెరిగి పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: