సౌత్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నయనతార.. తెలుగు తమిళ్ కన్నడ వంటి భాషలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ముఖ్యంగా తమిళంలో నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఎంతో మంది స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ అందుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు నయనతార.. నయనతార డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. అయితే విగ్నేష్ కంటే ముందు శింబు, ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం కొనసాగించింది..అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. వివాహం అనంతరం నయనతార జీవితం అంతగా సాఫీగా సాగలేదు.. ఎన్నో వివాదాలు నిలిచింది సరోగసి ద్వారా పిల్లల్ని కనడం చాలా దుమారాన్ని సృష్టించింది. ఈ సమస్య ముగిసిన అంతలోనే నయనతార నటించిన అన్నపూరణి సినిమా కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ చాలా ఇబ్బందులు పడింది. నయనతారకు వివాహం తర్వాత కష్టాలు మొదలవుతాయని ఆమె విడాకులు తీసుకోవడం ఖాయం అంటూ కూడా గతంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పడం జరిగింది...ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే నయనతార కూడా అడుగులు వేస్తున్నట్లు చాలా క్లారిటీగా కనిపిస్తోంది.. సోషల్ మీడియాలో తన భర్త విఘ్నేషన్ అన్ ఫాలో చేయడంతో అసలు విషయం బయటి పడింది.. అయితే ఈ విషయం పైన అటు నయనతార కానీ విగ్నేష్ కానీ ఎవరు స్పందించకపోవడంతో పలు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. మరి కొంత మంది టెక్నికల్ సమస్యల వల్ల విగ్నేష్ పేరు కనిపించకుండా ఉన్నదని ఏడేళ్లపాటు రిలేషన్ లో ఉండి..2022 లో  విగ్నేష్ నయనతార వివాహం చేసుకున్నారని.. జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతోందని పలువురు నెటిజెన్స్ తెలుపుతున్నారు. మరి విడాకులపై వస్తున్న ఈ వార్తల పైన ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: