ఇండస్ట్రీలోకి ఎంతోమంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొంతమంది మాత్రం ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కృష్ణవంశీ ఒకరు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు కృష్ణవంశీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలతో సూపర్ హిట్ లు అందుకున్నాడు. ఇక ఎప్పుడూ ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ ఉండేవాడు కృష్ణవంశీ   ఇక వైవిధ్య భరితమైన సినిమాలతో ప్రేక్షకులను అబ్బురపరుస్తూ ఉండేవాడు అని చెప్పాలి. అందుకే ఇక మిగతా దర్శకులతో పోల్చి చూస్తే కృష్ణవంశీకి ఇండస్ట్రీలో సపరేట్ ఇమేజ్ ఏర్పడింది. ఇక కృష్ణవంశీ తెరకెక్కించే ప్రతి సినిమాలోను ఏదో ఒక కొత్త కథాంశం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. గులాబీ, నిన్నే పెళ్ళాడుతా, సింధూరం లాంటి సినిమాలతో తన స్టామినా ఏంటో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యేలా చేశాడు కృష్ణవంశీ. ఇక తర్వాత ఖడ్గం, మురారి లాంటి భారీ సక్సెస్ లను కూడా అందుకున్నాడు అని చెప్పాలి. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింధూరం సినిమాకి ఇప్పటికి కూడా ప్రేక్షకులు మరిచిపోరు. ఇప్పటికీ టీవీలో వచ్చిన ఇక పనులన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చెబుతూ ఉంటారు. ఈ మూవీలో బ్రహ్మాజీ మెయిన్ హీరోగా రవితేజ సెకండ్ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇక సెకండ్ హీరోగా నటించిన రవితేజను డైరెక్టర్ కృష్ణ వంశీ కొట్టాడట. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారిపోయింది. సాధారణంగా రవితేజ ఎప్పుడు హైపర్ యాక్టివ్ గా ఉంటాడు. అలాగే ఇక ఎప్పుడూ డల్ గా ఉండే వాళ్ళు రవితేజకు అస్సలు నచ్చరట. ఈ క్రమంలోనే సింధూరం షూటింగ్ జరుగుతున్న సమయంలో రవితేజ తనదైన శైలిలోనే అందరితో కలివిడిగా ఉంటూ.. జోకులు వేస్తూ ఉన్నాడట. ఇక తన సీన్ చేయాల్సి వచ్చినపుడు రవితేజని డైరెక్టర్ కృష్ణవంశీ పిలిచిన పట్టించుకోలేదట. దీంతో కృష్ణవంశీ వచ్చి కామెడీగా రవితేజ వీపు మీద రెండు దెబ్బలు కొట్టి షాట్ రెడీ అయింది పద అని చెప్పాడట  దీంతో రవితేజ కామ్ గా వెళ్లి ఇక సీన్ పూర్తి చేశాడట. అయితే వీరిద్దరి మధ్య మొదటి నుంచి గురు శిష్యుల రిలేషన్షిప్ ఉంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: