టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇప్పటికే ఎన్నో సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలలో హీరోగా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ నటుడు ఆఖరుగా నటించిన లైగర్ , ఖుషి రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. లైజర్ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిగా ... ఖుషి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందింది. ఇలా ఈ రెండు మూవీ లతో ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ నటుడు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే మొదట ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీని ... సమయాన్ని ప్రకటించింది. ఈ రోజు అనగా మార్చి 4 వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ఈ మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd