బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి షారుక్ ఖాన్ కొంత కాలం ప్రతి జవాన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార , దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించగా ... తమిళ సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాకు సెన్సేషనల్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా కొల్ల గొట్టి షారుక్ కెరియర్ లోనే సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్టు లో చేరిపోయింది. ఇకపోతే ఆ తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అదిరిపోయి రేంజ్ రెస్పాన్స్ లభించింది.

ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: