మ్యాచో స్టార్ గోపీచంద్ ఆఖరుగా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు , కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజాయన్ని అందుకుంది. ఇలా రామబాణం మూవీ తో అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న గోపీచంద్ తాజాగా బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. 

మూవీ లో మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్ హీరోయిన్ లుగా నటించగా ... హర్ష అనే కన్నడ దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు దాదాపుగా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్ లును ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మరి ఇప్పటికే పక్కా కమర్షియల్ ... రామబాణం సినిమాలతో వరసగా అపజాయలను ఎదుర్కొన్న గోపీచంద్ "భీమా" ఈ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc