నేషనల్ క్రష్ రాష్మిక మందన ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ నటి కన్నడ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయం లోనే ఈ బ్యూటీ టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇకపోతే అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ కొనసాగిస్తున్న సమయం లోనే ఈ నటి అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన "పుష్ప పార్ట్ 1" సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ నటికి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దానితో ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి వరుసగా హిందీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ యానిమల్ అనే హిందీ సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా తన క్రేజ్ ను మరింత గా పెంచుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ నటిస్తున్న క్రేజీ మూవీ లలో "పుష్ప పార్ట్ 2" మూవీ ఒకటి. ఈ సినిమాపై బారి అంచనాలు నెలకొని ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో "పుష్ప 2" మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను తెలిపింది. తాజా ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ ... "పుష్ప పార్ట్ 2" మూవీ పార్ట్ 1 కి మించి ఉంటుంది. పుష్ప మొదటి భాగం సూపర్ సక్సెస్ కావడంతో పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ ని సుకుమార్ గారు తెరకెక్కిస్తున్నారు అని రష్మికమూవీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను తాజా ఇంటర్వ్యూ లో తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: