టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో చాందిని చౌదరి ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం వారు ఈ మూవీ ని ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో హీరో గా నటించినటువంటి విశ్వక్ కూడా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన ఈ సినిమా షూటింగ్ సమయం లో జరిగిన కొన్ని సంఘటనలను ... అలాగే ఈ సినిమా చిత్రీకరణ సమయం లో కొన్ని ప్రమాదాల నుండి తాను బయటపడ్డ విధానాన్ని ఈయన చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విశ్వక్ మాట్లాడుతూ ... గామి మూవీ చిత్రీకరణలో భాగంగా మేము కొన్ని సన్నివేశాలను చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో షూట్ చేశాము. హిమాలయాల్లోని ఓ గడ్డ కట్టిన నదిపై సీన్ సవాలుగా అనిపించింది. పైకి అది గడ్డ కట్టి ఉన్న లోపల అన్నది చాలా వేగంగా నది పరుగులు పెడుతుంది. చాందిని కి సంబంధించిన సన్నివేశాల షూట్ సమయంలో మంచు పగిలిపోతున్న శబ్దం రావడంతో ఆమె వెంటనే బయటకు పరిగెత్తుకొచ్చింది.

ఆ ఘటన జరిగిన తర్వాత నుండి సాహసాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్లు విశ్వక్ తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమా నుండి పలు ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో చాలా వరకు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మార్చి 8 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs